
‘జులాయి’ వంటి సూపర్ హిట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్ పై చిత్రీకరిస్తున్నారు
అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. సమంత, అదా శర్మ, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

