
హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న మెగా క్యాంపు హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ రీసెంట్ గా ‘రేసు గుర్రం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అది కాకుండా బన్ని రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. అలాగే తాజాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి’లో కూడా గోనగన్నా రెడ్డి పాత్రలో కనిపించడానికి అంగీకరించాడు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరో సినిమాలో అతిధి పాత్రలో కనిపించడానికి బన్ని సిద్దమవుతున్నట్లు సమాచారం.
బన్ని అతిధి పాత్రలో కనిపించబోయే సినిమా మరెవరిదో కాదు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘గొల్లభామ’ సినిమాలో కావడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తే బాగుంటుంది అని ఈ చిత్ర టీం అనుకొని అల్లు అర్జున్ ని అప్రోచ్ అయ్యారు. ఈ విషయంపై బన్ని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెగా ఫ్యామిలీ హీరోనే కాబట్టి కచ్చితంగా బన్ని ఆ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

