విక్రమ్ కుమార్ తో బన్నీ సినిమా ఉంటుందట !

విక్రమ్ కుమార్ తో బన్నీ సినిమా ఉంటుందట !

Published on Oct 24, 2018 11:43 PM IST

Allu Arjun

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్నాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో బన్నీ స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. కాగా క్లాస్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ, త్వరలో ఓ చిత్రంలో నటించబోతున్నారని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రాన్ని చేయటానికి బన్నీ ఆసక్తి
చూపిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక బన్నీతో విక్రమ్ కుమార్ సినిమా ఉండదు అనుకున్నారు అంతా.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విక్రమ్ కుమార్ చెప్పిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. కాకపోతే కథలో కొన్ని మార్పులు చెయ్యమని చెప్పారని, స్క్రిప్ట్ పకడ్బంధీగా ఉండేలా చెయ్యమని కోరారని తెలుస్తోంది. దీన్ని బట్టి బన్నీ ఫ్యూచర్ లో విక్రమ్ తో ఖచ్చితంగా సినిమా చెయ్యటం ఖాయంగా కనిపిస్తోంది. కాకపొతే అది తరువాత సినిమానా లేక ఆ తర్వాత సినిమానా అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

తాజా వార్తలు