మరో సారి ముఖ్య అతిధిగా రానున్న బన్నీ !

మరో సారి ముఖ్య అతిధిగా రానున్న బన్నీ !

Published on Nov 8, 2018 1:01 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రానున్నాడు. నవంబర్ 11న ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగనుంది. ఇక అల్లు అర్జున్ ఇంతకుముందు విజయ్ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం యొక్క ఆడియో వేడుక కు ముఖ్య అతిధిగా వచ్చారు ఆ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది. మరి ఈ టాక్సీవాలా కు కూడా ఆ సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందో లేదో చూడాలి.

రాహుల్ సంక్రుత్యాన్ తెరకెక్కించిన ఈచిత్రంలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు