
2014లో రేసు గుర్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రానుంది. సున్నితమైన భావోద్వేగాలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల అల్లు అర్జున్ కి కథ చెప్పాడు.
ఆ కథ అల్లు అర్జున్ కి కూడా బాగా నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ ని డెవలప్ చెయ్యమని చెప్పినట్లు సమాచారం. ప్రసతుతం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. చెప్పాలంటే శేఖర్ కమ్ముల మొదటిసారి స్టార్ హీరోతో చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల చివరిగా చేసిన సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

