గోనగన్నారెడ్డి ఫస్ట్ లుక్ కి విశేష స్పందన

Allu-Arjun's-Gona-Gannaredd
గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా బృందం విడుదలచేస్తున్న ప్రతీ ఒక్క వీడియో వీక్షకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ క్రమంలో గుణ టీమ్ వర్క్స్ విడుదల చేసిన మూడవ మేకింగ్ వీడియోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త గెట్ అప్ ‘గోన గన్నారెడ్డి’ మేకింగ్ వీడియోని మనకు సంక్రాంతికానుకగా అందజేశారు. విడుదలైన సమయం నుండి ఈ వీడియో సోషల్ నెట్వర్కింగ్ రంగంలో మంచి రెస్పాన్స్ వస్తుంది

ఫేస్ బుక్ లో లక్షలకు పైగా షేర్ లు, యు ట్యూబ్ లో మిలియన్ కి దగ్గరగా హిట్లు రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్ధమవుతుంది. ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతదర్శకుడు. గుణశేఖర్ దర్శకనిర్మాత

Exit mobile version