చిన్న సినిమాలకు అల్లు అర్జున్ మాట సాయం

చిన్న సినిమాలకు అల్లు అర్జున్ మాట సాయం

Published on Jul 6, 2019 8:18 PM IST

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ యంగ్ హీరోలకు చేస్తున్న మాట సాయం చూస్తుంటుంటే ఆయన్ని పొగడకుండా ఉండలేం. నిన్న నవీన్ పోలిశెట్టి నటించిన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రం పై పొగడ్తలు కురిపించిన బన్నీ, తాజాగా శ్రీవిష్ణు,నివేదా థామస్, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “బ్రోచేవారెవరురా” మూవీకి సపోర్ట్ గా ట్వీట్ చేశారు. బ్రోచేవారెవరురా మూవీ చూశాను, ఆద్యంతం హాస్యంతో పాటు,థ్రిల్ కలిగిస్తూ ఆకట్టుకుంది, హీరో శ్రీవిష్ణు కి అలాగే డైరెక్టర్, మిగతా సాంకేతిక వర్గానికి, నటులకు అభినందలు అని ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు.

సినిమాలో అన్ని అంశాలు బాగున్నా సరైన ప్రచారం లేక మరుగున పడిపోయే చిత్రాలకు అల్లు అర్జున్ లాంటి పేరున్న స్టార్స్ ఇలా ప్రచారం కల్పించడం శుభపరిణామం అని చెప్పాలి. ఇలాంటి చిన్న సినిమాలపై స్టార్స్ స్పందించడం వలన ఎంతో కొంత మేర వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ చేయూతను అభినందించాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు