యాక్టింగ్ వైపు చూస్తోన్న ‘అల్లు బాబీ’ ?

యాక్టింగ్ వైపు చూస్తోన్న ‘అల్లు బాబీ’ ?

Published on Jul 30, 2019 6:01 PM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు ‘అల్లు బాబీ’ ఇటీవలే నీల షాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నేళ్లల్లో యాక్టింగ్ వైపు ఏ మాత్రం ఇంట్రస్ట్ చూపని ‘అల్లు బాబీ’.. ప్రస్తుతం తానూ కూడా తనకు తగ్గ పాత్రల్లో యాక్ట్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారట. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా తన నిర్మాణంలో ఆ మధ్య ఓ సినిమా కూడా ప్లాన్ చేశాడు బాబీ.

ఈ ఏడాదిలోనే ఆ సినిమాని నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. అయితే గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలోనే అల్లు బాబీ నిర్మాతగా తన సినిమాలను నిర్మిస్తారా లేక వేరే ఏదైనా బ్యానర్ పెడతారా అనేది చూడాలి. అలాగే త్వరలోనే అల్లు బాబీను స్క్రీన్ మీద చూడొచ్చు. కొంతమంది డైరెక్టర్స్ తో కూడా బాబీ తానూ నటించాలనుకుంటున్నట్లు చెప్పారట. మరి ఆ డైరెక్టర్స్ లో ముందుగా బాబీని ఎవరు తెలుగుతెరకు నటుడిగా పరిచయం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు