“ఏ బి సి డి” ఫలితంపై హుందాగా స్పందించిన అల్లు శిరీష్‌..

Published on May 30, 2019 6:06 pm IST

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడైన అల్లు శిరీష్ మంచి హీరోగా తెలుగు తన మార్క్ వేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ “ఏ బి సి డి” జయాపజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిన శిరీష్ ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తానన్నాడు. ‘మేమంతా మీకు మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం. కానీ అంచనాలను అందుకోలేకపోయాం’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్‌మీట్‌లు పెట్టి హడావిడి చేస్తున్న తరుణంలో శిరీష్‌ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :

More