ప్రభాస్ చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న అల్లు శిరీష్

ప్రభాస్ చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న అల్లు శిరీష్

Published on Jan 7, 2012 1:18 PM IST


కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ తమిళ చిత్ర రంగం లో కి “100 % లవ్” లేదా “మిస్టర్ పెర్ఫెక్ట్” చిత్రాలలో ఏదో ఒక చిత్ర రీమేక్ తో తమిళ చిత్ర రంగం లో కి ప్రవేశించబోతున్నారు అని చెప్పాము. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అల్లు శిరీష్ తమిళ చిత్ర పరిశ్రమ లో కి ప్రభాస్ నటించిన “మిస్టర్ పెర్ఫెక్ట్” చిత్రం రీమేక్ తో ప్రవేశించబోతున్నారు. 2011 లో మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రం మంచి విజయం సాదించిన చిత్రం ఈ చిత్రం లో ప్రభాస్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషించారు.

శిరీష్ చెయ్యబోతున్న చిత్రానికి కొత్త కథానాయిక ను ఎంపిక చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్ ముంబై లో నటన లో శిక్షణ పొందుతున్నారు. ఈ చిత్రం తో మెగా కుటుంబం నుండి మరొక కథానాయకుడు వస్తున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు