మే 30న లాంచ్ కానున్న శిరీష్ కొత్త సినిమా !


ఇటీవలే ‘ఒక్క క్షణం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన యువ హీరో అల్లు శిరీష్ కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి ( అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం ఉండనుంది.

ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా ప్రారంభంకానుంది. అలాగే జూన్ నెల నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని కూడ తెలుస్తోంది. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version