గత కొన్ని రోజుల కితమే మెగా వారి ఇంట పెళ్లి సందడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అల్లు యంగ్ హీరో అల్లు శిరీష్ మరియు నయనికాల వివాహ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఇక ఈ పెళ్లి జరిగిన తర్వాత అల్లు శిరీష్ తన సతీమణితో కలిసి కొన్ని క్యూట్ మూమెంట్స్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది.
మరి ఇందులో శిరీష్ తన చేతిపై భార్య నయనిక పేరుని తెలుగులో రాసుకొని దానిని షేర్ చేసుకున్నాడు. అలాగే తమ మధ్య ప్రేమ కనిపించేలా మరో పిక్ ని కూడా షేర్ చేసుకోగా ఇప్పుడు తన పోస్ట్ ఫోటోలు వారి ఫాలోవర్స్ లో వైరల్ గా మారాయి. దీనితో అల్లు అభిమానులు, మెగా ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి వివాహ వేడుకకి చిరు, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సహా అనేకమంది సినీ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
