బన్నీ తనపై తానే సెటైర్ వేసుకున్నాడుగా

బన్నీ తనపై తానే సెటైర్ వేసుకున్నాడుగా

Published on Aug 15, 2019 12:14 PM IST

బన్నీ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ మోస్ట్ అవైటెడ్ టైటిల్ వచ్చేసింది. రెండు రోజులుగా టైటిల్ పై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ప్రకటిచేశారు. టైటిల్ తో పాటు ,ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో ఓ చిన్న టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. “అల,వైకుంఠపురంలో” అనే విభిన్నతతో కూడిన ఓ క్లాసిక్ టైటిల్, ఫిక్స్ చేశారు.

ఇంట్రో వీడియోలో అల్లు అర్జున్, స్ట్రైప్స్ టి షర్ట్ ధరించి, హిప్పీ క్రాప్ లో ఆర్య 2 లుక్ గుర్తు చేశారు. ఓ మధ్యతరగతి కుటుంబ వాతావరణంతో కూడిన పల్లెటూరి పెంకుటింటిలో అల్లు అర్జున్, మరో నటుడు మురళీ శర్మ కనిపించారు. మురళి శర్మ బన్నీ తండ్రి పాత్ర చేస్తున్నారనిపిస్తుంది. ఇక మురళి శర్మ చెప్పిన “ఏంట్రోయ్… గ్యాపిచ్చావ్…” అనే డైలాగ్ కి, “ఇవ్వలేదు…, వచ్చింది” అని బన్నీ చెప్పి, తనపై తానె సెటైర్ వేసుకున్నాడు. బన్నీ గత చిత్రం “నా పేరు సూర్య,నా ఇల్లు ఇండియా” మూవీ విడుదలై ఏడాది దాటిపోయిన సంగతి తెలిసిందే. ఐతే త్రివిక్రమ్ ” అ” సెంటిమెంట్ మాత్రం వదలలేదు.

పొగ మంచు తెరల నుండి బయటపడుతన్న ఓ అందమైన ఒంటరి భవనం, ఆహ్లదకరమైన సంగీతంలో మొదలైన అల వైకుంఠపురంలో ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ఆకట్టుకొనేలా ఉంది. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు