
‘అల్లుడు శీను’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో మంచి స్పందన రాబట్టుకుంటుంది. బి మరియు సి సెంటర్లలో ఈ చిత్రం అధ్బుతంగా ప్రదర్శింపబడుతుంది.
ట్రేడ్ విశ్లేషకులు ఈ చిత్రానికి లాంగ్ రన్ లో కనీసం 15 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఒక కొత్త హీరో కి రావడం చాలా పెద్ద విషయం. బెల్లంకొండ సురేష్ వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పాటు సమంతా లాంటి వారిని ఈ చిత్రానికి ఎంపిక చేసుకుని ఫాలో అయిన స్ట్రాటజీ బాగా పనిచేసిందనే చెప్పాలి.
సాయి శ్రీనివాస్ కి ఈ చిత్రం ద్వారా ఎన్నో మంచి అవకాశాలు రానున్నాయి అంతేకాకుండా తన మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహం తనకి కావాల్సిన ఆత్మవిశ్వాసం ఇవ్వనుంది.

