దాదాపు రెండేళ్లు.. సింబా ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎదురు చూపులు!

Mokshagna

టాలీవుడ్ లో ఎంతో కాలం అవైటెడ్ గా ఉన్న క్రేజీ డెబ్యూ లలో నట సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కూడా ఒకటి. ఎప్పుడో బాలయ్య సింహా సినిమా సమయం నుంచే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే గత రెండేళ్ల కితం 2024 లో ఎట్టకేలకు తమ బాలయ్య వారసుడు ఎంట్రీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఖరారు అయ్యింది.

అక్కడ నుంచి మళ్లీ ఇపుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు కూడా వచ్చింది. అయినప్పటికీ తమ సింబా ఎంట్రీ విషయంలో క్లారిటీ లేకపోవడంతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ తోనే తన ఎంట్రీ అనౌన్స్ అయ్యింది కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్టు కూడా ఊసు లేదు.

సో దీనితో మోక్షజ్ఞ ఎంట్రీ ఏమైనట్టు అనే ప్రశ్న చాలా మందిలో ఉండిపోయింది. ఇక ఇంకోపక్క ప్రశాంత్ వర్మతో సినిమా టైటిల్ కూడా లాకయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. సో వీటి అన్నిటిపై అభిమానులు కోరుకుంటున్న క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version