అప్పుడే సిద్ధమంటున్న బాలయ్య!?

అప్పుడే సిద్ధమంటున్న బాలయ్య!?

Published on May 18, 2024 7:00 PM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109 వ సినిమాని దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ కి కొన్నాళ్ళు విరామం ఇచ్చి బాలయ్య ఉత్సాహంగా తన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి ఇలా ముగిసి వారం కూడా గ్యాప్ లేకుండానే బాలయ్య అప్పుడే సినిమా షూట్ కోసం సిద్ధం అయిపోయినట్టుగా తెలుస్తుంది.

రేపటి నుంచే బాలయ్య తన నయా సినిమా షూట్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది. దీనితో బాలయ్య సినిమా, పాలిటిక్స్ విషయాల్లో జెట్ స్పీడ్ లో మంచి కమిట్మెంట్ తో ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా (Urvashi Rautela), బాబీ డియోల్ (Bobby Deol) వంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు