అప్పుడే రూలింగ్ స్టార్ట్ చేసిన ‘జరగండి’ సాంగ్

అప్పుడే రూలింగ్ స్టార్ట్ చేసిన ‘జరగండి’ సాంగ్

Published on Mar 27, 2024 5:01 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్”. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అవైటెడ్ ఫస్ట్ సాంగ్ ‘జరగండి’ ని నేడు చరణ్ పుట్టినరోజు కానుకగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది అంతే కాకుండా వచ్చిన ఈ కొన్ని గంటల్లోనే యూట్యూబ్ మ్యూజిక్ లో రూలింగ్ స్టార్ట్ చేసింది.

అప్పుడే యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండ్స్ లో ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ఈ సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మొత్తానికి అయితే గేమ్ చేంజర్ సెన్సేషన్ మొదలైంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు నటించగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే తెలుగు సహా తమిళ్ మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ ప్లాన్ చేస్తుండగా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు