యువ హీరో నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. ఆర్ధిక సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. సమస్యలను పరిష్కరించిన ఈ చిత్ర నిర్మాతలు ఆగస్ట్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాని సరసన అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శంభో శివ శంభో’ ఫేం సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెండాపై కపిరాజు’ చేసినందుకు గర్వపడుతున్నానని హీరో నాని అన్నారు.
ప్రేమ కథలలో నటించడం చాలా ఈజీ. ఒక సందేశాత్మక చిత్రంలో నటించడం చాలా కష్టం. అందులోను రెండు పాత్రలు చేయడం వలన ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మూడు రోజుల క్రితం సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం మొత్తం సరవుతుంది అనే కాన్సెప్ట్ తో సినిమా రూపొందింది. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించాను. ఇటువంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది. అని నాని అన్నారు.


