“వీరమల్లు” షూటింగ్, రిలీజ్ పై ఏ.ఎమ్ రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“వీరమల్లు” షూటింగ్, రిలీజ్ పై ఏ.ఎమ్ రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 29, 2024 5:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) రాజకీయాల్లో బిజీగా ఉంటున, వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ హీరో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చిత్రాలు చేస్తున్నారు. అయితే ఓజి చిత్రంను సెప్టెంబర్ 27, 2024 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే వీరమల్లు చిత్రానికి సమర్పకులు గా వ్యవహరిస్తున్న ఏ. ఎమ్ రత్నం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ చిత్రం ను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది అని, పవన్ కళ్యాణ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు చిత్రీకరణ పూర్తి చేస్తాం అని అన్నారు. ఈ చిత్రం కి ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, మిగిలిన సన్నివేశాలకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే వీరమల్లు రిలీజ్ పై ఏ. ఎమ్ రత్నం చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నాజర్, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ గా థియేటర్ల లోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు