కమల్ సినిమా కోసం ఎగ్జైట్ అవుతున్న అమల

కమల్ సినిమా కోసం ఎగ్జైట్ అవుతున్న అమల

Published on Nov 7, 2015 6:45 PM IST

amala-kamal-hassan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చేసిన ‘చీకటి రాజ్యం’/’తూంగావనం’ అనే సినిమా దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. నవంబర్ 10న తమిళ వర్షన్ తూంగవనం విడుదల కానుండగా, నవంబర్ 20న చీకటి రాజ్యం విడుదలకు సిద్దంగా ఉంది. ‘చీకటి రాజ్యం’ ప్రమోషన్స్ లో తన తదుపరి సినిమా మళయాల సినీ దర్శకుడు టి. కె. రాజీవ్ దర్శకత్వంలో ఉంటుందని, ఆ సినిమాలో అమల అక్కినేని నటించనుందని తెలిపారు.

రీసెంట్ ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ ‘కమల్ గారి సినిమాలో నటించడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఆయన సినిమా కోసం ప్రాణం పెడతారు. ఆయనతో మళ్ళీ నటించనుండడం చాలా ఆనందంగా ఉందని’ తెలిపింది. అమెరికా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో అమల అక్కినేనితో పాటు జరీన్ వాహిబ్‌, మరో కొత్త హీరోయిన్ కూడా నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

తాజా వార్తలు