సూర్య సరసన అమలా పాల్.!

సూర్య సరసన అమలా పాల్.!

Published on Feb 5, 2015 1:51 AM IST

amala_paul
అందానికి అందం మరియు నటనలో టాలెంట్ ఉన్న హీరోయిన్ అమలా పాల్. ఇటీవలే డైరెక్టర్ ఎ.ఎల్ విజయ్ ని పెళ్లి చేసుకున్న అమలా పాల్ కొత్త సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. ఈ గ్యాప్ తర్వాత అమలా పాల్ వరుసగా సినిమాలకు సైన్ చేసే పనిలో ఉంది. అందులో భాగంగా అమలా పాల్ సూర్య తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ లో చేయనున్న సినిమాకి సైన్ చేసింది. పాండ్య రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో చైల్డ్ యాక్టర్స్ ప్రాధాన్ అపాత్రలో నటిస్తారు. సూర్య కూడా నటించనున్న ఈ సినిమాలోసూర్య కి భార్యగా అమలా పాల్ నటిస్తుంది. ముందుగా ఈ పాత్ర జ్యోతిక చేస్తుందనే వార్తలు వినిపించినా ఫైనల్ గా ఆ అవకాశం అమలా పాల్ ని వరించింది. ఇది కాకుండా అమలా పాల్ పెళ్ళికి ముందే నటించిన మలయాళ హర్రర్ మూవీ ‘మిలి’ సినిమా ఇటీవలే విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలో అమలా పాల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య ప్రస్తుతం మాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తాడు.

తాజా వార్తలు