తెలుగు చిత్రపరిశ్రమ వర్గాల ప్రకారం అమలపాల్ తన తదుపరి తెలుగు చిత్రం వస్తా నీ వెనుక లో మారనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె ఈ చిత్రంపై ఒప్పందాన్ని కూడా వెనక్కి ఇచ్చినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. హవిష్ ప్రధాన నటుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
అమలపాల్ పెళ్ళి విషయం ఖరారు అయిన తరువాత ఆమె నటించే విషయం పై వస్తా నీవెనుక చిత్ర నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఓ ప్రముఖ దిన పత్రిక తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ తీసుకునే సమయంలో తన పెళ్ళికి సంబంధించిన విషయాలు డైరెక్టర్ కు తెలపలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ను ఫైనల్ కాస్టింగ్ కోసం హోల్డ్ లో ఉంచారు. ఈ చిత్రంలో ఈషా మరో హీరోయిన్ గా నటిస్తోంది.
జూన్ 12 న ఫిల్మ్ మేకర్ ఏఎల్ విజయ్ తో అమలపాల్ నిశ్చితార్దం జరుపుకొంటోంది. ఈ ఇద్దరు కూడా గత కొద్ది రోజుల క్రితం వీరి ప్రేమను తెలుపుకున్నారు. ఇప్పుడు తన సినీ జీవితం పై అమలపాల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
