పెళ్ళయ్యాక సినిమాలు చేయనంటున్న అమలా పాల్

పెళ్ళయ్యాక సినిమాలు చేయనంటున్న అమలా పాల్

Published on May 14, 2014 1:56 PM IST

Amala-Paul
‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలతో తెలుగులో బాగానే పరిచయం ఉన్న అందాల భామ అమలా పాల్ త్వరలో తమిళ డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకోనున్న సంగతి మనకు తెలిసిందే.. తాజా సమాచారం ప్రకారం ఈ పెళ్ళికి సంబందించిన కార్యక్రమాలు మొదట కేరళలో జరుగుతాయి. ఆ తర్వాత చెన్నైలో ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

పెళ్లి సంగతి పక్కన పెడితే ప్రస్తుతాన్ ఇండస్ట్రీలోని వారు, అభిమానులు ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే పెళ్ళైన తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటిస్తుందా?.. గత కొద్ది రోజులుగా మీడియాలో తిరుగుతున్న ఈ ప్రశ్నకి అమలా పాల్ సమాధానం ఇచ్చింది. ‘పెళ్ళైన తర్వాత సినిమాలు చేయాలనుకోవడం లేదు. నేను నా వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని’ అమలా పాల్ తెలిపింది. అందులో భాగంగానే ప్రస్తుతం అమలా పాల్ తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది.

తాజా వార్తలు