మురళీ మోహన్ చేతుల మీదుగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ లాంచ్

మురళీ మోహన్ చేతుల మీదుగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ లాంచ్

Published on Jan 31, 2026 8:00 AM IST

Amaravathiki-Ahwanam

లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “అమరావతికి ఆహ్వానం”. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. హారర్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

​టీజర్ విడుదల సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ, చిన్న చిత్రాలే చిత్ర పరిశ్రమకు ప్రాణమని, దర్శకుడు జీవీకే ఈ సినిమాను చాలా ప్రతిభావంతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. రియల్ ఎస్టేట్ రంగంలో సుపరిచితులైన నిర్మాతలు కె.ఎస్. శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు అభిరుచితో ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, తమ సంస్థ నుండి వస్తున్న ఆరో చిత్రమిదని, ప్రేక్షకులకు నచ్చే అన్ని హారర్ అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.

​హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, దర్శకుడు సినిమాను అనుకున్న బడ్జెట్‌లో, నాణ్యతతో పూర్తి చేశారని, ముఖ్యంగా ఎస్తేర్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ అని చెప్పారు. జీవీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పద్మనాబ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. అశోక్ కుమార్, భద్రమ్, జెమినీ సురేష్ కీలక పాత్రలు పోషించిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు