2026 కోసం అదిరిపోయే కంటెంట్ తెస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో

amazon

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 2026 సంవత్సరానికి సంబంధించి తమ ఒరిజినల్స్ మరియు పోస్ట్ థియేటర్ డిజిటల్ హక్కుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌లో ప్రేక్షకులను ఊరించే పలు ఆసక్తికరమైన టైటిల్స్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో ప్రకటించిన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు మరియు సినిమాల వివరాలు ఇక్కడ చూద్దాం.

​గువ్వల చెరువు ఘాట్ (తెలుగు):

కిరణ్ అబ్బవరం, తిరువీర్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిద్ధూ, తేజస్వి రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

​స్టార్మ్ (హిందీ):

అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వంలో పార్వతి తిరువోతు, అలయ ఎఫ్, శ్రిష్టి శ్రీవాస్తవ మరియు సబా ఆజాద్ ప్రధాన తారాగణంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.

​కాల్ మీ బేయ్ – సీజన్ 2 (హిందీ):

అనన్యా పాండే ప్రధాన పాత్రలో వచ్చిన ‘కాల్ మీ బేయ్’ రెండో సీజన్ వస్తోంది. కొలిన్ డికున్హా దర్శకత్వంలో అనన్యతో పాటు వీర్ దాస్, శృతి హాసన్ ఇందులో నటిస్తున్నారు.

​దహాద్ – సీజన్ 2 (హిందీ):

రీమా కాగ్తీ, రుచికా ఒబెరాయ్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దహాద్’ రెండో సీజన్‌తో రాబోతోంది.

​జగమే సంగీతం (తెలుగు):

పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ మేక మరియు సుస్మితా శెట్టి కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది.

​ఇసకపట్నం (తెలుగు):

గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, సునీల్ మరియు నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

​గల్లీ (తెలుగు):

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ ఇది. ఇందులో జెడి చక్రవర్తి, హన్సిక మోత్వాని, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

​ఇన్‌స్పెక్టర్ రిషి – సీజన్ 2 (తెలుగు/తమిళం):

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ రెండో సీజన్‌ను నందిని జెఎస్ తెరకెక్కిస్తున్నారు. సునయన, కిషోర్ కుమార్ ఇందులో ఇతర పాత్రల్లో కనిపిస్తారు.

​మట్కా కింగ్ (హిందీ):

నాగరాజ్ మంజులే దర్శకత్వంలో విజయ్ వర్మ ప్రధాన పాత్రలో ‘మట్కా కింగ్’ సిరీస్ వస్తోంది. ఇందులో కృతీకా కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

​మెస్ (హిందీ):

రాకేష్ ఎ. కృష్ణన్ దర్శకత్వంలో ప్రతీక్ గాంధీ, రణవీర్ షోరే, గజరాజ్ రావు ప్రధాన పాత్రల్లో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

​ఎగ్జామ్ (తమిళం):

దర్శకుడు సర్గుణం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్, అదితి బాలన్ మరియు అబ్బాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

​వదంతి – సీజన్ 2 (తమిళం):

ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో శశికుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘వదంతి’ రెండో సీజన్ కూడా ఈ జాబితాలో ఉంది.

​అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించిన ఈ ఒరిజినల్ చిత్రాలు మరియు సిరీస్‌లు ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటి విడుదల తేదీలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత రానుంది.

Exit mobile version