‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్

Published on Feb 27, 2024 3:01 AM IST

సుహాస్ హీరోగా శివాని నగరం హీరోయిన్ గా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్ ఎమోషనల్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుని మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ఈ మూవీ మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ మూవీని ధీరజ్ మొగిలినేని ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ బండారి, స్వర్ణకాంత్ తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు