‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ : ఆ యూజర్స్ కి ఎర్లీ ఓటిటి స్ట్రీమింగ్ యాక్సెస్

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ : ఆ యూజర్స్ కి ఎర్లీ ఓటిటి స్ట్రీమింగ్ యాక్సెస్

Published on Feb 29, 2024 12:09 AM IST

సుహాస్ హీరోగా శివాని నగరం హీరోయిన్ గా యువ దర్శకుడు దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ మూవీని ధీరజ్ మొగిలినేని నిర్మించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

ఇక ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని ఆహా ఓటిటి మాధ్యమం వారు సొంతము చేసుకున్న విషయం తెలిసిందే. మ్యాటర్ ఏమిటంటే, నేడు అర్ధరాత్రి నుండి ఈ మూవీ ఎర్లీ స్ట్రీమింగ్ యాక్సెస్ ని ఆహా వారు గోల్డ్ యూజర్స్ కి అందిస్తున్నారు. రేపటి నుండి ఆహా నార్మల్ యూజర్స్ కి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. మరి అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు