టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”

టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”

Published on Mar 28, 2024 10:58 AM IST

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ దుష్యంత్ కటికనేని దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ పై తాజాగా క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టార్ మా లో ప్రసారం కానుంది. శివాని నాగారం, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు