బజ్ : “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు” ఓటిటి రిలీజ్ డేట్

బజ్ : “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు” ఓటిటి రిలీజ్ డేట్

Published on Feb 11, 2024 6:06 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా యంగ్ హీరోయిన్ శివాని నాగారం హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతూ దర్శకుడు దుశ్యంత్ కటికనేని తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”. మరి గత వారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ని అందుకొని వసూళ్లు కూడా సాలిడ్ గా రాబట్టింది.

దీనితో ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై అయితే లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఈ మార్చ్ 1న అయితే స్ట్రీమింగ్ కి వస్తుందని టాక్. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం అందులో అప్పటి నుంచి అందుబాటులో ఉండనుంది. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ త్వరలోనే రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు