ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయ్యినటువంటి పలు చిత్రాల్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “3 ఇడియట్స్” కూడా ఒకటి. అప్పట్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా కొన్నాళ్ల పాటుగా ఇండియన్ సినిమా నుంచి అదే అత్యధిక వసూళ్ల సినిమాగా కొనసాగింది.
అయితే ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అమీర్ ఖాన్ లేటెస్ట్ గా అందించడం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయట. అంతే కాకుండా ఆ సినిమా టైం లైన్ కి మరో పదేళ్ల తర్వాత సినిమా ఉండబోతుంది అని తాను రివీల్ చేశారు. దీనితో పాటుగా మంచి కామెడీ ఎలిమెంట్స్ ఇంకా ముగ్గురు లీడ్ హీరోలకి సెపరేట్ ట్రాక్ లు కూడా ఉంటాయని తెలిపారు. దీనితో ఇది విన్న బాలీవుడ్ ఆడియెన్స్ ఈ సినిమా పట్ల మరింత ఎగ్జైట్ అవుతున్నారు.


