కమల్ ‘థగ్ లైఫ్’లో అమితాబ్ ?

కమల్ ‘థగ్ లైఫ్’లో అమితాబ్ ?

Published on Feb 12, 2024 5:44 PM IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో మళ్ళీ చాన్నేళ్లకి థగ్ లైఫ్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ థగ్ లైఫ్ చిత్రం కమల్ కెరీర్ లో 234వ చిత్రం. ఈ చిత్రం సహ నిర్మాతలలో కమల్ కూడా ఒకరు. కాగా ఈ థగ్ లైఫ్ చిత్రంలో ఓ అతిధి పాత్ర ఉంది. ఈ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తాజాగా టాక్ నడుస్తోంది. మరి నిజంగా అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తే.. పైగా కమల్ హాసన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే అదిరిపోతుంది.

కాగా అనౌన్సమెంట్ తోనే మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే షూటింగ్ ని స్టార్ట్ చేసుకుంది. ఇక మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ కమల్ ‘థగ్ లైఫ్’ కి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత కమల్ – మణిరత్నం కాంబోలో మరో సినిమా రాబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు