సైరా’లో తన లుక్ ఎలా ఉంటుందో రివీల్ చేసిన అమితాబ్ !

27th, March 2018 - 04:54:48 PM

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘సైరా’ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కథలో నరసింహారెడ్డికి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. షూటింగ్ నిమిత్తం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న అమితాబ్ లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు.

వాటి తాలూకు ఫోటో ఒకదాన్ని తన బ్లాగ్లో పోస్ట్ చేశారాయన. అందులో అమితాబ్ పొడవాటి, గుబురు గడ్డంతో వృద్ధుడి గెటప్లో తీవ్రంగా కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇదే ఆయన ఫైనల్ లుక్ కాకపోయినా సినిమాలో దాదాపుగా ఇలానే కనిపించనున్నారు అమితాబ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటిస్తుండగా అమిత్ త్రివేదిసంగీతాన్ని అందించనున్నారు.