అమితాబ్ కలవరపాటే నిజమైందా !

అమితాబ్ కలవరపాటే నిజమైందా !

Published on Feb 26, 2018 4:24 PM IST


స్టార్ నటి శ్రీదేవి మరణంతో బాహారతీయ సినీ పరిశ్రమ నివ్వెరపోయింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఊహించని ఉపద్రవం ఆమె అభిమానుల్ని దుఃఖ పర్యంతం చేసింది. ఈ ఉపద్రవం జరగడానికి కొద్దిసేపటి ముందే బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ తన ‘ఎందుకో తెలియట్లేదు కానీ నా మనసు ఏదో కలవరానికి గురువవుతోంది’ అంటూ తీవ్రమైన ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే శ్రీదేవి మరణ వార్త బయటి ప్రపంచానికందింది. దీంతో అందరూ అమితాబ్ కలవరపాటే నిజమైందని అనుకుంటున్నారు. మరి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలకు అందని ఈ అంశాన్ని నిజమనుకోవాలో లేకపోతే కేవలం యాధృచ్ఛికమనుకోవాలో కానీ అమితాబ్ కు గతంలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. 1982లో ‘కూలి’ చిత్ర షూటింగ్లో ఉన్న ఆయనకు ప్రమాదం సంభవించినట్టు అప్పటి నటి స్మితపటేల్ కు కల రావడం, ఆమె ఆయనకు ఫోన్ చేసి పరామర్శించడం, ఆ పక్కరోజే అమితాబ్ సెట్స్ లో పెద్ద ప్రమాదానికి గురికావడం జరిగింది.

తాజా వార్తలు