ప్రభాస్ 20 కి కూడా ఆయనే సంగీత అందిస్తున్నారు !

ప్రభాస్ 20 కి కూడా ఆయనే సంగీత అందిస్తున్నారు !

Published on Jan 8, 2019 4:05 PM IST

amit trivedi
రెబల్ స్టార్ ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఇటీవలే ఇటలీ లో కంప్లీట్ అయ్యింది. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అయన టాలీవుడ్ లోకి మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన సైరా టీజర్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. మరి అమిత్ ఈ ప్రభాస్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి.

యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. ఇక ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్ బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం సాహో షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

తాజా వార్తలు