నిర్మాణాంతర కార్యక్రమాలలో అమ్మాయి ప్రేమలో పడితే

Published on Aug 15, 2019 11:00 am IST

మణీందర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం “అమ్మాయి ప్రేమలోపడితే”. మణీందర్‌ సరసన హీరోయిన్ గా సోనాక్షి వర్మ నటిస్తుంది. ఎ.ఎస్.ఎం.ఆర్ సమర్పణలో అరిగెల ప్రొడక్షన్స్‌ బేనర్‌పై హర్షవర్ధన్‌, రమేష్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా హీరో మరియు దర్శకుడు మణీందర్‌ మాట్లాడుతూ “స్వచ్చమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. గతంలో విడుదలై విజయం సాధించిన చిత్రాలే ఇందుకు ఉదాహరణ గా చెప్పొచ్చు. అలాంటి ఓ సచ్ఛమైన ప్రేమకథగా మా చిత్రం”అమ్మాయి ప్రేమలో” పడితే తెరకెక్కుతోంది. మంచి లవ్ అండ్ ఎమోషన్ ఎలిమెంట్స్ తో రూపొందుతోన్న మా చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం” అన్నారు.

ఈ మూవీకి మణీందర్ దర్శకత్వం వహించగా, హర్షవర్ధన్, రమేశ్ నిర్మించడం జరిగింది. కాగా ఈ చిత్రానికి చిన్ని కృష్ణ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :

More