ట్రైలర్ తో ఆసక్తి పెంచిన ‘అమృతారామమ్‌’ !

AmruthaRamam1

నూతన దర్శకుడు సురేందర్‌ దర్శకత్వంలో రామ్‌ మిట్టికంటి హీరోగా అమితా రంగనాథ్‌ హీరోయిన్ గా రాబోతున్న ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘అమృతారామమ్‌’. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ ను చూస్తుంటే సినిమా.. ప్రేమకథా నేపథ్యంలో ప్యూర్ ఫీల్ గుడ్ తో సాగే పక్కా లవ్ ఎమోషనల్ డ్రామాగా అనిపిస్తోంది.

ట్రైలర్ లో.. ‘ఈ ప్రపంచంలో చావు కంటే నరకం ఏంటో తెలుసా… ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించడం’ అనే డైలాగ్ తో పాటు ‘ప్రేమలో సంతోషాలే కాదు త్యాగాలు కూడా ఓ భాగమే’ లాంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు సురేందర్‌ దర్శకత్వ పనితనం ఇంప్రెస్ చేసేలా ఉంది. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కొత్తగా కనిపించిన కొన్ని షాట్స్ కూడా బాగున్నాయి.

నిర్మాత ఎస్‌.ఎన్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా పై నెటిజన్లల్లో ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version