మగ బిడ్డకు జన్మనిచ్చిన యామీ జాక్సన్

మగ బిడ్డకు జన్మనిచ్చిన యామీ జాక్సన్

Published on Sep 23, 2019 5:03 PM IST

‘రోబో 2.0, ఎవడు, ఐ’ వంటి సినిమాల్లో కథానాయకిగా నటించిన హీరోయిన్ యామీ జాక్సన్ తన ప్రేమికుడు వ్యాపారవేత్త అయిన జార్జ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యామీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. అంతేకాదు బిడ్డకు గ్రీక్ సాంప్రదాయం మేరకు తాత పేరును ఆండ్రియాస్ అని పెట్టారు. ఈ సంతోష సమయంలో యామీకి, ఆమె కుటుంబానికి 123తెలుగు తరపున శుభాకాంక్షలు. ఈ సంగతి తెలుసుకున్న అనేక మంది సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు పంపుతున్నారు.

https://www.instagram.com/p/B2wCaALpayw/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు