‘హరి హర వీరమల్లు’ టీమ్ నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్

‘హరి హర వీరమల్లు’ టీమ్ నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్

Published on Feb 12, 2024 11:49 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో భారీ ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు కూడా ఒకటి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాబీ డియోల్, విక్రమ్ జీత్ విర్క్, నోరా ఫతేహి, పూజితా పొన్నాడ తదితరులు నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పాన్ ఇండియన్ రేంజ్ లో ఏ ఎం రత్నం గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గురించి నేడు మేకర్స్ ఒక ఎగ్జైటింగ్ అప్ డేట్ ని అందించారు. ప్రస్తుతం తమ మూవీకి సంబంధించి కెనడా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇరాన్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని, అతి త్వరలోనే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు హరి హర వీరమల్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఇక త్వరలో ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు