“పుష్ప 2” ఆల్బమ్ పై ఆసక్తికర నిజం.!

“పుష్ప 2” ఆల్బమ్ పై ఆసక్తికర నిజం.!

Published on May 1, 2024 2:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నుంచి ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ ని మేకర్స్ ఏ సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ సాంగ్ సహా సినిమా ఆల్బమ్ విషయంలోనే ఆసక్తికర నిజం ఉంది. అదేమిటంటే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల అవుతుంది. దాదాపు అన్ని సినిమాల్లానే ఇది కూడా మెయిన్ 5 భాషల్లో ఫిక్స్ అయ్యింది. అయితే వీటితో పాటుగా అదనంగా బెంగాలీ భాషలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.

మరి ఈ బెంగాలీ భాషలో మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ అవుతున్న మొట్ట మొదటి సాంగ్ పుష్ప 2 ఫస్ట్ సింగిల్ కాగా పుష్ప 2 మొత్తం ఆల్బమ్ కూడా మొట్ట మొదటిదే అని చెప్పాలి. దీనితో బెంగాలీలోకి కూడా అడుగు పెడుతున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ నే నిలిచాడు. మొత్తానికి అయితే పుష్ప 2 మేనియా కూడా గట్టిగానే ఉంటుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు