వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్?

వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్?

Published on Dec 10, 2025 9:00 PM IST

Aadarsha Kutumbam House

లేటెస్ట్ గా మోస్ట్ అవైటెడ్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ విక్టరీ వెంకటేష్ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా నుంచి ఫస్ట్ లుక్ సహా టైటిల్ ని కూడా మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ అంటూ మంచి ఫ్యామిలీ టచ్ తో కూడిన టైటిల్ పెట్టి కేవలం ఓ క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా దీనిని తీసుకొస్తున్నారని చాలామంది భావించి ఉండొచ్చు.

కానీ దానికి మించిన థ్రిల్ అంశాన్ని త్రివిక్రమ్ ఇందులో ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. ఎక్కడ వరకో కూడా అక్కర్లేదు సరిగ్గా టైటిల్ నే గమనిస్తే అందుకు సమాధానం దొరుకుతుంది. ఈ టైటిల్ లో కుటుంబం అనే పదం చివరి లోనే ఎరుపు రంగులో హైలైట్ చేస్తూ ఒక రక్త ప్రవాహంలా కనిపిస్తుంది. పైగా టైటిల్ లోనే ఏకే 47 అంటూ కూడా చెప్పాడంతో ఇది కేవలం ఫ్యామిలీ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సర్ప్రైజింగ్ థ్రిల్ చేసే యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా వస్తుందని చెప్పొచ్చు. సో వీటిపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు