“మ్యాడ్” సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్

“మ్యాడ్” సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్

Published on Mar 30, 2024 2:58 PM IST

టాలీవుడ్ నుంచి వచ్చిన పలు చిత్రాల్లో మెయిన్ గా యూత్ ని ఎంతగానో అలరించిన సినిమాల్లో యంగ్ హీరో నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే నితిన్ రామ్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన క్రేజీ రైడ్ చిత్రం “మ్యాడ్” కూడా ఒకటి. మరి గత ఏడాది వచ్చిన చిత్రాల్లో ఇది కూడా సూపర్ హిట్ అయ్యి మంచి వసూళ్లు అందుకుంది. అయితే దీనికి సీక్వెల్ పై కూడా ఆడియెన్స్ లో మంచి బజ్ ఉంది.

ఇక దీనిని మేకర్స్ కూడా కన్ఫర్మ్ చేయగా ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ అవైటెడ్ సీక్వెల్ కి ఇపుడు ఇంట్రెస్టింగ్ టైటిల్ లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం పార్ట్ 2 ని “మ్యాడ్ మ్యాక్స్” గా మేకర్స్ తీసుకురాబోతున్నారట. అదే ప్రధాన తారాగణంతో సినిమా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా, అనంతిక అలాగే గోపిక ఉదయన్ లు హీరోయిన్స్ గా నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు