రవితేజ, అనుదీప్ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసారా!?

రవితేజ, అనుదీప్ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసారా!?

Published on Apr 27, 2024 1:00 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇప్పుడు “మిస్టర్ బచ్చన్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత తన కెరీర్ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 75వ సినిమా అయితే మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. మరి ఈ చిత్రాన్ని జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత రవితేజ నుంచి ఓ సాలిడ్ ఎంటర్టైనర్ అయితే ఈ సినిమాతో ఉంటుంది అని అంతా ఆశిస్తున్నారు.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా ఇపుడు సమాచారం. మరి దీని ప్రకారం మేకర్స్ “దొంగ – పోలీస్” అనే టైటిల్ ని పెట్టారట. మరి దీనితో ఇదేమన్నా క్రైమ్ కామెడీ నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారా అనేది చూడాలి. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా ఇది హిందీ చిత్రం రైడ్ కి రీమేక్ గా తీస్తున్నారు. అలాగే ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు