గెట్ రెడీ..పవన్ మరో సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్.!

Published on Apr 2, 2021 8:00 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” విడుదల పనుల్లో బిజీగా ఉండగా మరో పక్క పవన్ మిగతా రెండు సినిమా షూట్స్ సహా తన రాజకీయ విషయాల్లో కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఇంకా ఇవే అనుకుంటే పవన్ కు వీటి తర్వాత హరీష్ తో ఓ ప్రాజెక్ట్ అలాగే మన టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ మేకింగ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా ఉందన్న సంగతి కూడా తెలిసిందే.

మరి వీటిపై కూడా సాలిడ్ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండిట్లో సురేందర్ రెడ్డితో చెయ్యబోయే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై తొందరలోనే అప్డేట్ రానుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ పని చేస్తుండగా నిర్మాత రామ్ తళ్లూరి పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మసాలా డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపినట్టు తెలుస్తుంది. ఇక మేకర్స్ నుంచి వచ్చే ఆ అప్డేట్ ఏంటి అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :