
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రతో మెప్పించిన నటి అంజలి, ఆ తర్వాత తెలుగులో బాగా పాపులర్ అయిపోయిన విషయం తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే, మరోవైపు పలు ఆసక్తికర కథాంశాలతో రూపొందుతోన్న సినిమాలతోనూ మెప్పిస్తూ వస్తున్నారు. ఈ కోవలో అంజలి నటించిన ఓ హర్రర్ నేపథ్యంలో నడిచే సినిమాయే ‘చిత్రాంగద’. శ్రీ విజ్ఞేష్ కార్తీక్ సినిమా పతాకంపై శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘చిత్రాంగద’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను ఈ ఉదయం విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కథా నేపథ్యం, అంజలి లుక్స్ ఈ టీజర్‌లో మేజర్ హైలైట్స్‌గా కనిపిస్తున్నాయి. క్షుద్ర పూజలు, సైన్స్ అంశాలను ప్రస్తావిస్తూ ఓ సరికొత్త కథాంశంతో రూపొందిన హర్రర్ సినిమా ఇదని దర్శక నిర్మాతలు తెలియజేశారు. అంజలి యాక్టింగ్ ఈ సినిమా హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ రోజు విడుదలైన టీజర్‌తో సినిమాపై మంచి ఆసక్తి కనబరిచేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పొచ్చు.
చిత్రాంగద టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి