భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై రూపొందుతున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘లబ్బరు బొమ్మ’ అనే మాస్ ఐటమ్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తారక్ పొన్నప్ప, నందినీ రాయ్‌లపై చిత్రీకరించిన ఈ హుషారైన పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాంబాబు గోశాల రాసిన క్యాచీ లిరిక్స్‌కు దేవ్ జండ్ అందించిన సంగీతం తోడైంది. శ్రీకృష్ణ, సాహితీ చాగంటి పాడిన ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘అమ్మోరు దిగినాది’ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా, తాజాగా వచ్చిన ‘లబ్బరు బొమ్మ’ కూడా చార్ట్ బస్టర్‌గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం. కండ్రేగుల నాయుడు, త్రినాథరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్, లవ్, ఎమోషనల్ అంశాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
