ఆనంద్ దేవరకొండ ను సంప్రదిస్తున్న తమిళ డైరెక్టర్లు!

ఆనంద్ దేవరకొండ ను సంప్రదిస్తున్న తమిళ డైరెక్టర్లు!

Published on May 24, 2024 3:00 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రం తో భారీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత వరుస చిత్రాలు చేయకుండా, మంచి స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు. ఈ చిత్రం మే 31 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆనంద్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తను వంద కోట్ల చిత్రంలో భాగం అవుతా అని ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పెద్ద దర్శకులు తనను సంప్రదిస్తున్నారా అని అడిగినప్పుడు, తన వద్దకు పెద్ద దర్శకులు రారు అని అన్నారు. అయితే తన వద్దకు వంద మంది దర్శకులు వస్తే 50 మంది కొత్తవారు ఉంటున్నారు అని అన్నారు. ఆయితే తమిళ దర్శకులు తనను సంప్రదిస్తున్నారు అని అన్నారు. ఇప్పటి వరకూ 20 నుండి 25 మంది తమిళ దర్శకులు తనతో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు