వైరల్ అవుతున్న ‘యాత్ర’లో అనసూయ ఫోటో !

వైరల్ అవుతున్న ‘యాత్ర’లో అనసూయ ఫోటో !

Published on Nov 13, 2018 11:05 AM IST

Anasuya

మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ‘యాత్ర’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి బాగా ఇన్ వాల్వ్ చేస్తున్నారట. వైఎస్సార్ హావభావాలు దగ్గరనుంచి, ఆయన మాట తీరు, ఆయన నడక ఇలా ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్త అర్ధం చేసుకుంటూ.. మమ్ముట్టి, వైఎస్సార్ గారిని గుర్తుకు తెస్తున్నారు అంటున్నారు చిత్రబృందం.

కాగా ఈ చిత్రంలో అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం అనసూయ, మమ్ముట్టి మీద పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే సెట్ లో దిగిన ఓ ఫోటోను అనసూయ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ చిత్రంలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రను జగపతిబాబు, ఇతర కీలక పాత్రల్లో సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు