‘పుష్ప’లో అనసూయ.. ఇదిగోండి క్లారిటీ

Published on Mar 2, 2021 10:08 pm IST


బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ప్రత్యేక గీతాలకు కూడ సైన్ చేస్తోంది. ఇటీవలే ఆమె ‘చావు కబురు చల్లగా’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘థాంక్యూ బ్రదర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే కొన్నిరోజులుగా ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’లో స్పెషల్ రోల్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.

‘రంగస్థలం’ సినిమాలో ఆమె చేసిన రంగమ్మ పాత్రలాగానే ఉంటుందని, ఆ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ అంచ్చే సుకుమార్ ఆమెకు ఈసారి కూడ ఛాన్స్ ఇచ్చారని అన్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజమూ లేదట. అనసూయ ఆ సినిమాలో నటించట్లేదట. అసలు ఆమె వద్దకు ఏ ఆఫరూ వెళ్లలేదు. దీంతో ఇన్నాళ్లుగా వస్తున్న రూమర్లకు చెక్ పడింది. అంతేకాదు గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో కూడ అనసూయ ఒక బోల్డ్ రోల్ చేస్తున్నారని పుకార్లు రాగా అలాంటిదేం లేదని అనసూయ నేరుగా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ‘పుష్ప’ షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోంది. ఆగష్టు 13న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :