ఎమ్మెల్యే పాత్రలో అనసూయ !

Published on Jan 19, 2019 8:54 am IST


రియాల్టీ షోస్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని ఇటీవల సినీమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ యాంకర్ అనసూయ. అందులో భాగంగా క్షణం, రంగస్థలం లాంటి చిత్రాల్లో నటించి తన నటన తో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం అనసూయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర అనే బయోపిక్ సినిమాలో నటిస్తుంది. ఈచిత్రంలో ఆమె కర్నూల్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాత్రలో నటిస్తుంది. పాదయాత్ర సమయంలో 2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజిక వర్గం నుండి పోటీ చేసి చరితా రెడ్డి ఏవిందంగా గెలిచింది పార్టీ కోసం ఆమె కష్ట పడిన తీరును అనసూయ పాత్ర ద్వారా సినిమలో చూపించనున్నారు. ఇక ఈచిత్రంలో అనసూయ డి గ్లామరైజ్డ్ గా కనిపించనున్నారు.

మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోమలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలోనటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :