ఇలాంటి వారినా ట్రోల్ చేసేది? ప్రభాస్, పవన్ లపై తెలీని సీక్రెట్ రివీల్ చేసిన సుమ!

Movie

మన తెలుగు సినిమా దగ్గర సినిమా స్టార్స్ అంతంత రెమ్యునరేషన్ లు తీసుకుంటున్నారని బయట అనేక కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా చాలా మంది అటెన్షన్ సీకర్స్ తేలిగ్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ మన హీరోస్ లోనే చాలా మంది బయట చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం మాత్రం చాలా తక్కువ మాట్లాడుతారు ఆ కొందరు.

అయితే లేటెస్ట్ గా మన తెలుగు సినిమా టాప్ యాంకర్ సుమ కనకాల ఓ ఇంట్రెస్టింగ్ అండ్ తెలియని సీక్రెట్ అంశాన్ని పవన్ కళ్యాణ్ ఇంకా ప్రభాస్ ల విషయంలో రివీల్ చేయడం వైరల్ గా మారింది. తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇంకా ప్రభాస్ లు ఖమ్మంలో ఒక ఓల్డేజ్ హోమ్ నిర్మాణంలో తనకి ఎంతో సాయం చేసారని సుమ తెలిపారు. వారితో పాటుగా ఇంకొందరు అందుకు తోడ్పడ్డారని ఆమె తెలిపారు.

అంతే కాకుండా ప్రభాస్ అయితే ఈ వృద్ధాశ్రమంలో ఉండే పెద్దవారికి ప్రతీ నెల వారి యోగ క్షేమాల కోసం డబ్బు కూడా పంపుతున్నారని అది ప్రభాస్ దయా హృదయానికి నిదర్శనం అని ఆమె తెలిపారు. దీనితో సుమ రివీల్ చేసిన ఈ తెలీని సీక్రెట్ వైరల్ గా మారింది. మరి ఇలాంటి హీరోస్ ని కూడా చాలా మంది పలు విషయాల్లో ట్రోల్స్ చేస్తుంటారు. కానీ వీరు చేస్తున్న అజ్ఞాత సహాయాలు కోసం ఎవరికీ తెలియకపోవడం బాధాకరం.

Exit mobile version